జిల్లా తాండ్ర గ్రామానికి చెందిన నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన రాథోడ్ ప్రియాంక ఐఐటీ ఇండోర్‌లో సీటు సాధించింది. ఉన్నత విద్యను కొనసాగించేందుకు ల్యాప్‌టాప్ అవసరం కావడంతో ఆమె బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను ఆశ్రయించింది.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్పందించి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రారంభించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ప్రియాంకకు ల్యాప్‌టాప్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో కొనసాగుతున్న గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ఎంతోమందికి భరోసా కల్పిస్తోందని అన్నారు.
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
ఐఐటీ ఇండోర్‌లో సీటు సాధించిన ప్రియాంకకు ల్యాప్‌టాప్ అందడంతో ఆమె ఉన్నత విద్యకు మరో అడుగు ముందుకు పడింది.












