మిర్యాలగూడ పట్టణ పరిసర గ్రామాలు మంగళవారం సాయంత్రం 6:20 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకటిమయంగా మారాయి. పట్టణ శివారులోని టిక్యతండా వద్దగల 220 కె.వి. సబ్ స్టేషన్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. దీని కారణంగా మిర్యాలగూడ పరిసర గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకటిమయంగా మారాయి. ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
మరమ్మత్తు పనులు
సాంకేతిక సిబ్బంది మరమ్మత్తు పనులు చేపడుతున్నారని, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి మంగళవారం రాత్రి 7:30 నుంచి 8 గంటల లోపు సమయం పట్టవచ్చని తెలిపారు. ఏర్పడిన విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.












