మామడ, Mamada, Nirmal, Telangana (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 29
నిర్మల్ జిల్లా మామడ గ్రామంలో 19 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన హక్కు పత్రాలను మంగళవారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి చొరవతో జరిగిన ఈ కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు.
నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి చొరవతో మామడ గ్రామంలో 19 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన హక్కు పత్రాలను మంగళవారం పంపిణీ చేశారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన హక్కు పత్రాలను అందజేశారు. సొంతింటి కల నెరవేరేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా హక్కు పత్రాలు అందడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రకళ, సురేందర్, ఉపసర్పంచ్ ప్రవీణ్‌కుమార్, పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.












