జిల్లా మామడ మండల పరిధిలోని అనంతపేట గ్రామంలో అర్హులైన నిరుపేదల సొంతింటి కల నెరవేరింది. గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సోమవారం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రొసీడింగ్ పత్రాలను అధికారికంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సల్కమ్ తిరుమలేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని అన్నారు. గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా, పేదల సొంతింటి కల నెరవేరేలా రాబోయే రోజుల్లోనూ ప్రత్యేక కృషి చేస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ కూన బొర్రన్న, పంచాయతీ కార్యదర్శి మోహన్, నాయకులు మహేష్‌తో పాటు గ్రామ ప్రజాప్రతినిధులు, వివిధ వార్డుల సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.