మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక కృషితో నిర్మల్ జిల్లా మండలం కమల్ కోట్ గ్రామంలో నిరుపేదల సొంతింటి కల నెరవేరింది. గ్రామానికి చెందిన పలువురు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సోమవారం అధికారికంగా మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రావుల ముత్యం రెడ్డి మాట్లాడుతూ, పేదల సంక్షేమమే ధ్యేయంగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అందించిన సహకారం అభినందనీయమని కొనియాడారు.
గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గణిమెనా ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శి మురళి, నాయకులు లింగారెడ్డి, అబ్బడి మహేందర్ రెడ్డి, గంగాధర్, గంగామల్లేష్, చిన్నయ్యతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












