విద్యానగర్లోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు యాదవ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం ( ) ఓటు చోరీకి పాల్పడుతోందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బీజేపీకి తొత్తుగా, బీజేపీ ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగబద్ధ సంస్థను బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మార్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఓటు చోరీకి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, రాహుల్ గాంధీ పిలుపు మేరకు భద్రాద్రి జిల్లా కలెక్టరేట్ ఎదుట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ ధర్నాకు జిల్లాలోని అన్ని మండలాల నుండి, అన్ని నియోజకవర్గాల నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, యూత్ కాంగ్రెస్, , మహిళా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన కోరారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











