నిర్మల్ జిల్లా మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని నిర్మల్ జిల్లా మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మార్కండేయ మందిర ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన చేసిన త్యాగాలను, సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు బొజరాం, కార్యదర్శి జీ ముత్యం, సభ్యులు రాజేశ్వర్, డి నరసయ్య, తులసీరామ్, అంగరి గంగాధర్, భూమానందం, భోజరాముతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.












