ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో మరణించగా, మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. అంత్యక్రియలు చేయడానికి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో, ఆసుపత్రి సిబ్బంది మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్ ను ఫోన్ ద్వారా సంప్రదించారు. వారు వెంటనే స్పందించి, ఈరోజు హిందూ స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ గొప్ప కార్యక్రమానికి చేయూత అందించిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ సుబాహన్, అశోక్, సతీష్, సలీం పాల్గొని అంత్యక్రియలను పూర్తి చేశారు.
సమాజంలో అనాథలకు కూడా గౌరవప్రదమైన అంత్యక్రియలు జరగాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని వారు తెలిపారు. మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ నిరంతరం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతూ, అవసరంలో ఉన్నవారికి అండగా నిలుస్తుందని ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు.











