లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ గ్రామానికి చెందిన దుడోళ్ల సరీల్ అనారోగ్యంతో చికిత్స పొంది ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ముధోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యుడు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు కరిపే శ్యాంసుందర్, సరీల్ ఇంటికి వెళ్లి ఆయనను, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న నాయకులు
ఈ సందర్భంగా సరీల్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.
పాల్గొన్న ఇతర నాయకులు
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సాగర్, మాజీ వైస్ ఎంపీపీ సాయన్న, మాజీ సర్పంచ్ దిగంబర్, సంజీవ్, బీఆర్ఎస్ నాయకులు అనిల్, దాసరి ప్రవీణ్, ఓంకార్, దేవేందర్, ఓరగంటి బాబు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.












