మిర్యాలగూడ పట్టణంలోని పాత లలిత టాకీస్ వద్ద భాగ్యలక్ష్మి కాంప్లెక్స్ లో నడుస్తున్న ఈఎస్ఐ ఆసుపత్రి (డిస్పెన్సరీ) 18 నెలల కిరాయ ఇవ్వకపోవడంతో యజమాని కర్నాటి కృష్ణ శుక్రవారం ఆసుపత్రి భవనానికి తాళాలు వేశారు. ఈ సందర్భంగావిలేకరులతో కృష్ణ మాట్లాడుతూ ఈఎస్ఐ ఆసుపత్రి భవనానికి 18 నెలల కిరాయ కరెంటు బిల్లులతో కలిపి 15 లక్షల రూపాయల వరకు రావాల్సి ఉందని, పలుసార్లు ఈఎస్ఐ ఉన్నత శాఖ అధికారులకు కిరాయి విషయంలో అడగడం జరిగిందన్నారు, ఆస్పత్రి భవన కిరాయ ఎన్నిసార్లు అడిగిన అధికారులు స్పందించకపోవడంతో నోటీసులు కూడా ఇవ్వడంజరిగిందన్నారు. అయినప్పటికీ స్పందించకపోవడంతో ఈరోజు భవనానికి తాళాలు వేశామన్నారు. రోగులు ఇబ్బందులు పడుతున్నందున మానవతా దృక్పథంతో ఈనెల 29 (సోమవారం) వరకు ఆసుపత్రి భవనానికి చెల్లించవలసిన కిరాయి బకాయిలు కోసం గడువు ఇస్తున్నని, ఈ లోగా చెల్లించని పక్షంలో ఈ నెల 30 (మంగళవారం) నుంచి శాశ్వతంగా భవనానికి తాళాలు వేస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై ఈఎస్ఐ ఆసుపత్రి డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ ఆస్పత్రి కిరాయి చెల్లించవలసి ఉందని అధికారులకుసమాచారం అందించామని, మంజూరు కాగానే ఆస్పత్రి బిల్డింగ్ కిరాయి చెల్లిస్తామని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేట్ భవనాలలో నడుస్తున్న ప్రభుత్వకార్యాలయాలకు కిరాయి చెల్లించమని, వెంటనే ఖాళీ చేసి ప్రభుత్వ భవనాలలోకి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చారని, ఈఎస్ఐ ఆసుపత్రి కు కావలసిన సౌకర్యాలతో కూడిన ప్రభుత్వ భవనంలభించకపోవడంతో ఈ విషయాన్ని ఈఎస్ఐ ఉన్నత అధికారులకు తెలియజేసి, ప్రైవేట్ భవనంలోనే ఆసుపత్రి కార్యకలాపాలు నడపవలసి వస్తుందన్నారు. సుమారు 45 వేల మంది కార్మికులు ఈ ఎస్ ఐ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు పొందుతున్నారని, ప్రతిరోజు 100 నుంచి 200 మంది రోగులు వైద్య సేవ కోసం వస్తుంటారని డాక్టర్ నాగేందర్ తెలిపారు. 18 నెలల నుంచి బకాయిలు ఉన్న మాట వాస్తవమేనని, ఈ విషయాన్ని ఉన్నత అధికారులు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరింప చేసేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు.
పలుసార్లు ఉన్నతాధికారులకు తెలియజేసినప్పటికీ స్పందించకపోవడంతో అందుకు నిరసిస్తూ ఈఎస్ఐ అధికారులకు కిరాయి చెల్లించాలని నోటీస్ కూడా ఇవ్వడం జరిగిందని యజమాని కర్నాటి కృష్ణ విలేకరులకు తెలిపారు. కరెంటు కరెంట్ బిల్లులు 1,75 వేల రూపాయలతో పాటు డిస్పెన్సరీ కిరాయి 15 లక్షల వరకు రావాల్సి ఉందన్నారు. ఈ విషయంపై ఈఎస్ఐ డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ కిరాయి బకాయి విషయంలో తమ ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగిందని తెలిపారు, సుమారు ఈ డిస్పెన్సరీ కింద ద్వారా 45 వేల మంది కార్మికులకు వైద్య సేవలు అందుతున్నాయని, ప్రతిరోజు 100 నుంచి 200 మంది రోగులు మెరుగైన వైద్య సేవలు పొందుతున్నారని, ఇదిలా ఉండగా ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ లో భవనాలను నిర్వహించరాదని అధికారులు ఆదేశాలు ఉన్న దృష్ట్యా ఈఎస్ఐ డిస్పెన్సరీ కు సరైన సదుపాయలతో ప్రభుత్వ భవనం లభించకపోవడంతో ఖాళీ చేయలేదని అందుకు కిరాయి బకాయిలు ఉన్నాయని ఈ విషయాన్ని ఉన్నతాధ అధికారులకు దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. యజమాని కర్నాటి కృష్ణ మాట్లాడుతూ మానవతా దృక్పథంతో సోమవారం వరకు డిస్పెన్సరీ తాళాలు తీస్తానని అవకాశం ఇస్తున్నానని మంగళవారం నుంచి పూర్తిగా తాళాలు వేసి బందు పాటిస్తామని పేర్కొన్నారు.












