తానూరు మండలంలోని బోసి గ్రామంలోని ప్రసిద్ధ కర్ర వినాయకుడికి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న కలెక్టర్‌కు పూజారులు, గ్రామస్థులు స్వాగతం పలికారు. అనంతరం స్థానిక శివాలయంలో గణేశుడికి, శివుడికి పూజలు నిర్వహించారు.
పూజల అనంతరం కలెక్టర్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. అన్ని పండుగలను ప్రజలంతా కలిసిమెలిసి జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భైంసా సబ్‌కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.












