నిజామాబాద్ జిల్లా మండలం జానకంపేట గ్రామానికి చెందిన బొమ్మకంటి సహస్ర, మహారాష్ట్రలోని పాలజ్ కర్ర వినాయకుని మండపంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో అయిగిరి నందిని దుర్గాదేవి పాట నృత్యంతో భక్తులను విశేషంగా అలరించారు. ఇటీవల నేపాల్ ప్రధానమంత్రి నుండి అవార్డు అందుకున్న సహస్ర ప్రదర్శనను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా అభినందించారు.
మహారాష్ట్రలోని పాలజ్ కర్ర వినాయకుని మండపంలో ప్రతిష్టించిన కర్ర వినాయకుడి వద్ద జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో, నిజామాబాద్ జిల్లా మండలం జానకంపేట గ్రామానికి చెందిన బొమ్మకంటి హరీష్ గౌడ్ దంపతుల ఏకైక కుమార్తె బొమ్మకంటి సహస్ర అయిగిరి నందిని దుర్గాదేవి పాట నృత్యంతో భక్తులను విశేషంగా అలరించారు. ఈ సందర్భంగా ముధోల్ మండలం చించాల గ్రామం ఉప సర్పంచ్ పిసర సాయినాథ్ గౌడ్, నిర్మల్ జిల్లా ఉప సర్పంచుల ఫోరం సోషల్ మీడియా కన్వీనర్ గా, బొమ్మకంటి సహస్రకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొమ్మకంటి కుటుంబ సభ్యులు, పాలజ్ కర్ర వినాయకుని మహారాష్ట్ర సభ్యులు పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు.
ఇటీవల బొమ్మకంటి సహస్ర నేపాల్ ప్రధానమంత్రి నుండి అవార్డు అందుకున్న నేపథ్యంలో, కూచిపూడి నృత్య ప్రదర్శనలో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఆమెను అభినందించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిజామాబాద్ జిల్లాకు చెందిన బొమ్మకంటి సహస్రకు మహారాష్ట్ర భక్తుల తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.












