నిర్మల్ జిల్లా మండలంలోని పాంగ్రీ గ్రామంలో షిర మొల్ల యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుడి లడ్డూకు వేలం నిర్వహించారు. స్థానిక సర్పంచ్ ఆకాష్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలం పాటలో లడ్డూను రూ.2,100కు దక్కించుకున్నారు.
గ్రామస్థులకు సర్పంచ్ సూచనలు
ఈ సందర్భంగా సర్పంచ్ ఆకాష్ పాటిల్ విజేతకు శుభాకాంక్షలు తెలిపారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలను గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో నిర్వహించుకోవడం శుభపరిణామం అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, భక్తులు, పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.












