భైంసా: గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో భైంసాలోని పురాతన సంప్రదాయం కనువిందు చేసింది. ఎడ్లబండిపై వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఎడ్లబండి వెంట యువత, యువతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తిగీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. భక్తిగీతాలు, నృత్యాలు, సంప్రదాయ వాతావరణంతో శోభాయాత్ర సాగుతుండగా రహదారుల వెంట నిలిచిన ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
ఆధునిక హంగులకు దూరంగా, పూర్వీకుల సంప్రదాయాన్ని గుర్తుచేసేలా సాగిన ఈ ఊరేగింపు చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తిశ్రద్ధల నడుమ శోభాయాత్ర గడ్డెన్న వాగు వద్దకు చేరుకుంది. అక్కడ భక్తులు వినాయక విగ్రహానికి ఘనంగా నిమజ్జనం నిర్వహించారు.
భక్తి, సంప్రదాయం, సంస్కృతి కలగలిసిన భైంసా గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.












