లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో మోక్ష గణపతిని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను స్వాగతించి, శాలువాతో సన్మానించి, మోక్ష గణపతి జ్ఞాపికను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పటేల్ మాట్లాడుతూ, మోక్ష గణపతి ఆశీస్సులతో వర్షాలు పుష్కలంగా కురిసి, పంటలు పండాలని, రైతన్న సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. గత పుష్కరాల్లో తాను 12 రోజుల పాటు అన్నదానం చేస్తే, ఈ ప్రాంత వాసులు తనకు ఎంతో సహకరించారని, వచ్చే ఏడాది పుష్కరాల్లో కూడా 12 రోజుల పాటు అన్నదానం చేస్తానని, సహకరించాల్సిందిగా కోరారు.
కార్యక్రమంలో భైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబుతో పాటు పలువురు సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.












