భోసి గ్రామంలో కొలువైన శ్రీ వరసిద్ధి కర్ర వినాయక స్వామివారిని మహారాష్ట్రలోని పింపుల్గావ్ గ్రామానికి చెందిన దత్తపీఠ స్వామీజీ శ్రీ తపస్వి బాలయోగి వెంకటస్వామి మహారాజ్ గురువారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. స్వామీజీకి గ్రామంలోని మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు.
భోసి గ్రామంలో కొలువైన శ్రీ వరసిద్ధి కర్ర వినాయక స్వామివారిని మహారాష్ట్రలోని పింపుల్గావ్ గ్రామానికి చెందిన దత్తపీఠ స్వామీజీ శ్రీ తపస్వి బాలయోగి వెంకటస్వామి మహారాజ్ గురువారం మధ్యాహ్నం దర్శించుకున్నారు.
స్వామీజీకి గ్రామంలోని మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. భోసి పాఠశాలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్ విద్యార్థులు శ్రీమతి వందన ఆధ్వర్యంలో స్వామీజీకి ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం శ్రీ వరసిద్ధి కర్ర వినాయక స్వామివారిని దర్శించుకున్న స్వామీజీ భక్తులకు ఆశీర్వచనం అందించారు. ఆయన ప్రవచనం వినేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు.
ఆధ్యాత్మిక సందేశంతో భోసి గ్రామంలో భక్తిమయ వాతావరణం నెలకొంది. స్వామీజీ ఆశీర్వచనం కోసం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.












