తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా రెండేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న మహేష్ కుమార్ గౌడ్‌ను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ అభినందించారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యేల నివాస క్యాంపు కార్యాలయంలో మహేష్ కుమార్ గౌడ్‌ను సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా రెండేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న మహేష్ కుమార్ గౌడ్‌ను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ అభినందించారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యేల నివాస క్యాంపు కార్యాలయంలో మహేష్ కుమార్ గౌడ్‌ను శాలువాతో సత్కరించి, జిల్లా ప్రజలు, కాంగ్రెస్ శ్రేణుల తరఫున శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మహమ్మద్ అయూబ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంలో, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంలో మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వం కీలకమని కొనియాడారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో పార్టీ కార్యకర్తలు ముందుండేలా నాయకత్వం అందిస్తున్నారని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో మహేష్ కుమార్ గౌడ్ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి పార్టీని మరింత బలోపేతం చేయాలని అయూబ్ ఆకాంక్షించారు. ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా నాయకత్వం కొనసాగాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












