ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్యం, రోగులకు ఇస్తున్న ఆహారం నాణ్యతను ఆయన పరిశీలించారు. రోగుల సహాయకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఆదిలాబాద్ పట్టణంలో గల రిమ్స్ ఆసుపత్రిని బుధవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్యంతో పాటు ఆహారాన్ని పరిశీలించారు. స్థానిక రోగుల సహాయకులతో మాట్లాడుతూ ఆహార నాణ్యత గురించి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన పైటనే విట్ఠల్ గారిని పరామర్శించి, వారి ఆరోగ్య బాగోగులు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన వైద్యం అందించాలని రిమ్స్ డైరెక్టర్ జేసింగ్ రాథోడ్ ను ఆదేశించారు. వీరి వెంట తిరుమల గౌడ్, రవి నాయక్, రాథోడ్ భీంరావ్, దేవేందర్ రెడ్డి, భూమన్న, సుజీల్ తదితరులు ఉన్నారు.












