వనపర్తి జిల్లా మండలం రామనాథపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త బజారు ఆంజనేయులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి రూ.5 లక్షల సహాయం అందించారు.
వనపర్తి జిల్లా మండలం రామనాథపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త బజారు ఆంజనేయులు రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మరణించారు. ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అండగా నిలిచారు. ఆయన భార్య మనీషా, ఇద్దరు కూతుళ్లకు (కావ్యశ్రీ, కీర్తన) ఆర్థిక భరోసా ఇచ్చారు.
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు, ఆంజనేయులు భార్య, తల్లికి ఐదు లక్షల రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ, కార్యకర్తలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కంటికి రెప్పలా కాపాడుకుంటారని తెలిపారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న భార్య, ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం ఐదు లక్షల రూపాయలు అందజేశామన్నారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న సందర్భంలో ఆర్థిక సహాయం అందించామని, అయినప్పటికీ ఆంజనేయులు గారిని కాపాడుకోలేక పోయామని అన్నారు. భవిష్యత్తులో ఇద్దరు కూతుళ్ల చదువులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.












