కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలపై ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు గ్రామ గ్రామాన బీఆర్ఎస్వీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు బీఆర్ఎస్వీ నాయకులు తెలిపారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఎంతవరకు అమలు చేసిందనే అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, విద్యార్థులు, యువత, మహిళలు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామస్థాయి నుంచి ప్రజల దృష్టికి తీసుకెళ్తామని బీఆర్ఎస్వీ నాయకులు తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా వ్యవస్థ, ఉద్యోగ నియామకాలు తదితర విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించేలా గ్రామ గ్రామాన పోరాటం కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గణగోని శ్రవణ్‌గౌడ్, చెట్టుపల్లి భానుచందర్, గొల్లపల్లి రాజశేఖర్‌రెడ్డి, మన్నె ఆనంద్, కొలను రఘు, నముండ్ల శ్రీకాంత్, ఎలుక అనిల్ పాల్గొన్నారు.












