చిన్నకోడూరు మండలంలోని విట్టలాపూర్ గ్రామానికి చెందిన పుచ్చకాయ లక్ష్మారెడ్డి మృతి చెందారు. ఈ విషయం మాజీ సర్పంచ్ పుచ్చకాయల సురేందర్ రెడ్డి ద్వారా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే దృష్టికి చేరింది.
దీంతో మృతుడి కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుచ్చకాయల సురేందర్ రెడ్డితో పాటు గ్రామ వార్డు సభ్యులు మధు, మార్కండేయ, శీను, ఓజిరెడ్డి, కొట్టాల వెంకటరెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.












