మిర్యాలగూడ, 18 October
మిర్యాలగూడ గ్రంథాలయంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న పేద దివ్యాంగుడు బాసాని లక్ష్మీనారాయణకు యోగా క్లబ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో రూ.25,555 ఆర్థిక సహాయాన్ని ఆదివారం అందజేశారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని యోగా క్లబ్ సభ్యులు చాటిచెప్పారు.
ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని యోగా క్లబ్ మిర్యాలగూడ సభ్యులు చాటిచెప్పారు. మిర్యాలగూడ గ్రంథాలయంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న పేద దివ్యాంగుడు బాసాని లక్ష్మీనారాయణకు యోగా క్లబ్ ఆధ్వర్యంలో రూ.25,555 ఆర్థిక సహాయాన్ని ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ యోగ ఉపాధ్యాయ సమాఖ్య ఉమ్మడి జిల్లా చైర్మన్ కోలా సైదులు ముదిరాజ్ మాట్లాడుతూ యోగా అంటే కేవలం ఆసనాలు, ప్రాణాయామం చేయడమే కాకుండా మనసును నిర్మలంగా ఉంచుకోవడం, తోటి మనుషుల కష్టాలను అర్థం చేసుకోవడం, ఆపదలో ఉన్నవారికి చేయూతనివ్వడం కూడా యోగాలో అంతర్భాగమని పేర్కొన్నారు. మనిషి గొప్పతనం సంపదలోనో, హోదాలోనో లేదని, కష్టాల్లో ఉన్న తోటి మనిషికి సహాయం చేసే హృదయంలోనే నిజమైన గొప్పతనం ఉంటుందని ఆయన ఉద్వేగభరితంగా అన్నారు. బాసాని లక్ష్మీనారాయణకు అందించిన ఆర్థిక సహాయం కేవలం డబ్బు మాత్రమే కాదని, ఆయనకు ధైర్యాన్ని, భరోసాను అందించే మానవీయ ప్రయత్నమని తెలిపారు. యోగా క్లబ్ మిర్యాలగూడ గతంలోనూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిందని గుర్తుచేశారు. కరోనా సమయంలో అనారోగ్యానికి గురైన యోగా సభ్యులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, పేద విద్యార్థిని ఐఐటీలో చదువుకునేందుకు సహకరించడం, దివ్యాంగులకు ఆర్థిక సాయం చేయడం, నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు.
మనకు చేతనైనంత సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మనం చేసే చిన్న సహాయం మరొకరి జీవితంలో పెద్ద వెలుగును నింపవచ్చని, మనిషికి మనిషే అండగా నిలవాలని, సేవా భావంతో సమాజంలోని నిరుపేదలకు, దివ్యాంగులకు తోడ్పాటునందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన గురూజీ చీదల్ల వెంకటేశ్వర్లు, పైడిమర్రి సురేష్, కంచర్ల వెంకటేశ్వర్లు, కంచర్ల శ్రీనివాస్ రెడ్డి, సముద్రాల నాగభూషణం, మజ్జిగపు అంజిరెడ్డి, శీలం చంద్రయ్య, జానపాటి శ్రీనివాస్, మాదా నాగేశ్వరరావు, బొగ్గారం శ్రీనివాస్, కొట్టే వెంకటయ్య, భీమ్లా నాయక్, రమేష్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కర్ణాటి శేఖర్, అంబటి వీరనారాయణ, గుడిపాటి కోటయ్య, అల్లంపల్లి శ్రీనివాసు, కొండూరు నరేందర్, చిల్లంచర్ల శ్రీనివాస్, వంగాల శ్రీనివాస్ రెడ్డి, నేరెళ్ల చంద్రశేఖర్, రేణిగుంట శ్రీనివాసు, జామలా నాయక్, శంకర్ నాయక్, సత్యనారాయణ రెడ్డి, చంద్రశేఖర్ తదితర యోగా సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహకరించిన యోగా సభ్యులందరినీ నిర్వాహకులు అభినందించారు. సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తూ, ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తామని వారు పేర్కొన్నారు.



