వేములవాడ, 14 October
మై వేములవాడ అన్నదాన సేవా ట్రస్టు ఆధ్వర్యంలో దాతల సహకారంతో గత 2013 రోజులుగా పేదలకు అన్నదానం నిర్వహిస్తున్నారు. మంగళవారం స్థానిక టీటీడీ ధర్మశాల వద్ద అన్నదానం కార్యక్రమం జరిగింది.
మై వేములవాడ అన్నదాన సేవా ట్రస్టు ఆధ్వర్యంలో దాతల సహకారంతో గత 2013 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్థానిక టీటీడీ ధర్మశాల వద్ద రాజన్న భీమన్న ఆలయం వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు.
నేటి అన్నదాతలు
నేటి అన్నదాతలుగా నెల్లూరు వాస్తవ్యులు మోహన్ చంద్ర, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు చిరంజీవి ప్రణయ్ చంద్ర తన పుట్టినరోజు సందర్భంగా నేటి అన్నదానానికి విరాళం అందించారు.
శాశ్వత సభ్యులు
అన్నదాన శాశ్వత సభ్యులుగా డాక్టర్ జువ్వాడి వెంకటేశ్వరరావు, స్నేహాలత, ప్రతాప స్వప్న, సంపత్, నగుబోతు రవీందర్, జ్యోతి, గణాచారి మఠం శైలజ, సాంబశివు, దేవరాజు ఉమ, బాలచందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత, వారి కొడుకులు, కోడళ్లు ప్రజ్ఞ, శరత్చంద్ర, శిరీష, సాయిచంద్ర, శర్వాణి, రవిచంద్ర, హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయి కృష్ణ ఉన్నారు.
పుట్టినరోజు, పెళ్ళిరోజు, ఇతర కార్యక్రమాలకు పేదలకు, అన్నార్తులకు ఒక్కపూట అన్నదానం చేయాలనుకునే దాతలు ట్రస్టు సభ్యులను గాని, ట్రస్టు నంబరు 9246939388కు సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు.
పాల్గొన్నవారు
నేటి కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, ప్రతాప నటరాజు, పసుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.











