కీసర, 9 November
కీసర పోలీస్ స్టేషన్లో అవినీతి వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది.
కీసర పోలీస్ స్టేషన్లో అవినీతి వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఎస్ఐ శ్రీనివాస్ పట్టుబడినట్లు సమాచారం. ఒక కేసులో చార్జ్‌షీట్ వేయడానికి రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐ శ్రీనివాస్, అదే మొత్తాన్ని లంచంగా తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారని తెలుస్తోంది.
వరుస ఘటనలతో కలకలం
ఇటీవల ఇదే పోలీస్ స్టేషన్లో సీఐ లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటన మరువకముందే, మరో ఎస్ఐ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కడం పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. ఒకే పోలీస్ స్టేషన్లో వరుసగా ఇలాంటి కేసులు బయటపడటం, అవినీతి తీరు మారకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.






