సారాంశం
కామారెడ్డి లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా నూతన సభ్యుల సమావేశం గురువారం నిర్వహించారు. రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలు, వాటిని మరింత సమర్థవంతంగా నిర్వహించే అంశాలపై సమావేశంలో చర్చించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్ సొసైటీని సేవా కార్యక్రమాల్లో ముందంజలో నిలిపి, రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని నిర్ణయించారు.
ముఖ్య విషయాలు
- 1రెడ్‌క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఈ నెల 16న శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు చైర్మన్ సంజీవరెడ్డి, రాష్ట్ర ఎంసీ సభ్యుడు డాక్టర్ ఎం.
- 2కామారెడ్డి లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా నూతన సభ్యుల సమావేశం గురువారం నిర్వహించారు.
- 3రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలు, వాటిని మరింత సమర్థవంతంగా నిర్వహించే అంశాలపై సమావేశంలో చర్చించారు.
- 4జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్ సొసైటీని సేవా కార్యక్రమాల్లో ముందంజలో నిలిపి, రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని నిర్ణయించారు.
కామారెడ్డి లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా నూతన సభ్యుల సమావేశం గురువారం నిర్వహించారు. రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలు, వాటిని మరింత సమర్థవంతంగా నిర్వహించే అంశాలపై సమావేశంలో చర్చించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్ సొసైటీని సేవా కార్యక్రమాల్లో ముందంజలో నిలిపి, రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని నిర్ణయించారు.
రెడ్‌క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఈ నెల 16న శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు చైర్మన్ సంజీవరెడ్డి, రాష్ట్ర ఎంసీ సభ్యుడు డాక్టర్ ఎం. జైపాల్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా రెడ్‌క్రాస్ అధ్యక్షుడు, కలెక్టర్, జిల్లా ఎస్పీ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
సమావేశంలో వైస్ చైర్మన్ దస్తిరాం, కోశాధికారి రమేష్‌రెడ్డి, మాజీ చైర్మన్ రాజన్నతో పాటు రెడ్‌క్రాస్ సభ్యులు పాల్గొన్నారు.