నిర్మల్, 10 November
నిర్మల్ పట్టణంలో రేపు జరగబోయే కేటీఆర్ రైతు గర్జన సభ ఏర్పాట్లను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఈరోజు పరిశీలించారు. ఈ పర్యటనలో ఆయన పలువురు పార్టీ నాయకులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నిర్మల్ పట్టణంలో రేపు జరగబోయే కేటీఆర్ గారి రైతు గర్జన సభ ఏర్పాట్లను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఎంపీ బాల్క సుమన్, నిర్మల్ ఇంచార్జి రాంకిషన్ రెడ్డి, ఖానాపూర్ ఇంచార్జి జాన్సన్ నాయక్ లతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
కనీవినీ ఎరుగని రీతిలో సభ
మీడియాతో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, కనీవినీ ఎరుగని రీతిలో రేపు నిర్మల్ లో రైతు గర్జన సభ జరుగబోతుందని, నిర్మల్ లో గులాబీ హవా పుంజుకోనుందని స్పష్టం చేశారు. సభకు భారీగా రైతులు తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.






