సారంగాపూర్, 8 September
మండలంలోని ప్యారమూర్ గ్రామంలో మహిళలకు తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు ప్రత్యేక చెత్త బుట్టలను పంపిణీ చేశారు. మండల అభివృద్ధి అధికారి () లక్ష్మీకాంత్, ఎంపీఓ అబ్దుల్ అజీజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ప్యారమూర్ గ్రామంలో చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమం మండలంలోని ప్యారమూర్ గ్రామంలో మండల అభివృద్ధి అధికారి ఎంపీడీవో లక్ష్మీకాంత్ ఎంపీఓ అబ్దుల్ అజీజ్ ఖాన్ ఆధ్వర్యంలో మహిళలకు తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు ప్రత్యేక చెత్త బుట్టలను పంపిణీ చేయడం జరిగింది. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి గ్రామపంచాయతీ ట్రాక్టర్లోనే వేయాలని, గ్రామంలో పరిశుభ్రతను పాటిస్తూ చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు సూచించారు. మన ప్యారమూర్ గ్రామాన్ని పరిశుభ్రంగా, స్వచ్ఛంగా, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో శ్రీ లక్ష్మీకాంత్ రావు అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు: గ్రామ సర్పంచ్ మాకునూర్ వరలక్ష్మి, ఉప సర్పంచ్ బీమయ్య, గారి రాంరెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేందర్ సింగ్, వార్డు సభ్యులు చిలుక నాగభూషణ్, కారోబర్ భూషణ్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మారెడ్డి, మహిళలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.












