వేస్తూ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 08
వినాయక చవితి పండుగ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట , జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల మస్కాపూర్ విద్యార్థులు వినూత్న ప్రతిభ కనబర్చి మంగళవారం కాగితపు గణపతిని ఆవిష్కరించారు. రసాయనాలతో కూడిన విగ్రహాలకు ప్రత్యామ్నాయంగా, పైసా ఖర్చు లేకుండా కేవలం కాగితంతో కన్నులు కదిలించే జీవకళా గణపతిని రూపొందించి అందరి మన్ననలు పొందారు.
పర్యావరణహితం.. అతి తక్కువ ఖర్చుతో ‘కన్నులు కదిలించే’ కాగితపు గణపతి! మస్కాపూర్ జడ్పీ పాఠశాల విద్యార్థుల వినూత్న సృజన. ఖానాపూర్ సెప్టెంబర్( మనోరంజని తెలుగు టైమ్స్) వినాయక చవితి పండుగ వేళ పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల మస్కాపూర్ విద్యార్థులు వినూత్న ప్రతిభ కనబర్చి మంగళవారం కాగితపు గణపతి ని ఆవిష్కరించారు. రసాయనాలతో కూడిన విగ్రహాలకు ప్రత్యామ్నాయంగా, పైసా ఖర్చు లేకుండా కేవలం కాగితంతో ‘కన్నులు కదిలించే జీవకళా గణపతి’ని రూపొందించి ఔరా అనిపించారు. పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు వెన్నం అంజయ్య ప్రోత్సాహంతో 7వ తరగతి విద్యార్థులు జంజిరాల నందిత, మాలవత్ శ్రీచందన, భూమి శివాని, గడ్డం అరణ్య, ఐనవేణి నిహారిక, గాండ్ల రిషిత్, చట్పెల్లి వర్షిత్ తమ ఆలోచనలకు పదునుపెట్టి ఈ విశిష్ట గణపతులను తయారు చేశారు. ఎ4 సైజ్ పేపర్‌పై అందమైన వినాయకుడి చిత్రాన్ని తీర్చిదిద్ది, లోపలివైపు కన్నులను అమర్చారు. కింది భాగం నుంచి చేతివేలితో సున్నితంగా కదిలిస్తే వినాయకుడి కన్నులు అటూఇటూ కదులుతూ సాక్షాత్తు గణనాథుడే కళ్లముందు కదిలినట్లు కనిపించడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా, అతి తక్కువ ఖర్చుతో అందరూ సులువుగా ఈ విధమైన గణపతులను తయారు చేసుకోవచ్చని తెలిపారు. రాబోయే వినాయక చవితికి తాము స్వయంగా రూపొందించిన ఈ కాగితపు గణపతినే భక్తిశ్రద్ధలతో పూజించనున్నట్లు చెప్పారు. పర్యావరణ హిత ఆలోచనలతో సరికొత్త ప్రయోగం చేసిన విద్యార్థులను, ప్రోత్సహించిన ఉపాధ్యాయుడు అంజయ్యను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు.











