సదాశివనగర్, 7 September
కామారెడ్డి జిల్లా మండలంలోని మర్కల్ గ్రామంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణం సందడిగా మారింది.
మర్కల్ మహిళా డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు కామారెడ్డి జిల్లా మండలంలోని మర్కల్ గ్రామం నందు ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల కామారెడ్డి నందు ఉపాధ్యాయ దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది.ముందుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి. శోభారాణి జ్యోతిప్రజ్వలన చేసి, కార్యక్రమం ను ఆరంభించారు. తధనంతరం ఉపాధ్యాయ దినోత్సవ గొప్పదనాన్ని, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయ వృత్తి కి అందించిన సేవలను గురించి వివరించారు. తర్వాత విద్యార్థులు ఉపన్యాసాలు, ఆటపాటలతో అలరించారు. మరియు గురువులందరిని సన్మానించారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎస్. కృష్ణవేణి, కల్చరల్ కమిటీ కోఆర్డినేటర్ డాక్టర్ కే . వనజ, సభ్యులు ప్రియాంక అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు












