లోకేశ్వరం, 11 September
నీట్లో ఉత్తీర్ణత సాధించి వైద్య విద్యను అభ్యసించాలనుకుంటున్న మండల విద్యార్థులకు డాక్టర్ దేవేందర్‌రెడ్డి చేయూతనిచ్చారు. ముఖ్యంగా తల్లిదండ్రుల అండలేని టి. ముత్తవ్వకు వైద్య విద్య చదువుకోవడానికి రూ.25 వేల ఆర్థిక సహాయం అందించి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.
నీట్ విజేతలకు డాక్టర్ దేవేందర్‌రెడ్డి చేయూత వైద్య విద్యకు రూ.25 వేల ఆర్థిక సాయం , సెప్టెంబరు 11 (మనరంజని తెలుగు టైమ్స్): నీట్లో ఉత్తీర్ణత సాధించి వైద్య విద్య అభ్యసించేందుకు సిద్ధమవుతున్న మండల విద్యార్థులను ప్రోత్సహించేందుకు డాక్టర్ దేవేందర్‌రెడ్డి ముందుకు వచ్చారు. ముఖ్యంగా తల్లిదండ్రుల అండలేని పరిస్థితుల్లో నీట్లో విజయం సాధించిన టి. ముత్తవ్వ ఉన్నత చదువులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో రూ.25 వేల ఆర్థిక సహాయం అందించి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. మండలానికి చెందిన టి. ముత్తవ్వతో పాటు ఎం. సాయి చైతన్య, మేఘన, ఎం. మనీష్ (ధర్మోర), నవ్యశ్రీ (బాగాపూర్) నీట్లో ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించి అభినందించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కష్టపడి చదివి వైద్య విద్యలో రాణించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి, ముఖ్యంగా తల్లిదండ్రుల అండలేని ముత్తవ్వకు డాక్టర్ చదువు కోసం రూ.25 వేల సాయం అందించిన డాక్టర్ దేవేందర్‌రెడ్డి, విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారని పలువురు కొనియాడారు. ఆర్థిక పరిస్థితులు ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత విద్యకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఇలాంటి సహాయాలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధార్వాడ్ కపిల్, అవర్గ సర్పంచ్ భుజంగరావు, ధర్మోరా సర్పంచ్ సంజీవరెడ్డి పిఎసిఎస్ మాజీ చైర్మన్ చిన్నారావు, మాజీ సర్పంచ్ శ్రీధర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు












