నిర్మల్, 8 September
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు చేపట్టిన బంద్‌లో భాగంగా నిర్మల్ పట్టణంలోని దీక్ష డిగ్రీ కళాశాలలో మంగళవారం విద్యార్థులు, అధ్యాపకులు నిరసన తెలిపారు. గత నాలుగు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం వాటిని విడుదల చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కళాశాల డైరెక్టర్ సిహెచ్ వెంకట్ రెడ్డి ఆరోపించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి..... ప్రైవేట్ కళాశాలల్లో రాష్ట్రవ్యాప్త బంద్ విజయవంతం.... నిర్మల్: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు చేపట్టిన బంద్‌లో భాగంగా నిర్మల్ పట్టణంలోని దీక్ష డిగ్రీ కళాశాలలో మంగళవారం బంద్ నిర్వహించారు. కళాశాల డైరెక్టర్ సిహెచ్ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ సిహెచ్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, గత నాలుగు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటిని విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి చదువుతున్న వేలాది మంది విద్యార్థులు, కళాశాలలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ప్రభుత్వం బకాయిలను విడుదల చేస్తామని హామీలు ఇస్తూ, ఆచరణలో మాత్రం జాప్యం చేస్తోందని పేర్కొన్నారు. దీంతో ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, కళాశాలల నిర్వహణతో పాటు సిబ్బందికి వేతనాలు చెల్లించడం కూడా కష్టంగా మారుతోందని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఆర్టీఎఫ్ (RTF) ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. బకాయిల విడుదలలో మరింత జాప్యం చేస్తే ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, సిబ్బంది, విద్యార్థులతో కలిసి మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న బంద్‌కు ప్రైవేట్ కళాశాలల నుంచి మంచి స్పందన లభించిందని, తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మెంగ శ్రీధర్ అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.











