బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలచెలిమి సంస్థ నిర్వహించిన జాతీయస్థాయి పిల్లల కథల పోటీ2026లో ప్రాథమికోన్నత పాఠశాల అంబం విద్యార్థిని మెరుగు సుచిప్రియ ప్రతిభ కనబరిచింది. ఆమె రాసిన కథ పోటీకి ఎంపికైంది.
ఎడపల్లి: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలచెలిమి సంస్థ నిర్వహించిన జాతీయస్థాయి పిల్లల కథల పోటీ2026లో ప్రాథమికోన్నత పాఠశాల అంబం విద్యార్థిని మెరుగు సుచిప్రియ ప్రతిభ కనబరిచింది. ఎనిమిదో తరగతి చదువుతున్న సుచిప్రియ తన తెలుగు ఉపాధ్యాయుడు బొడ్డు భరద్వాజ మార్గదర్శకత్వంలో రచించిన విషతుల్యమైన నేల... విషాదమైన బ్రతుకులు అనే కథ పోటీకి ఎంపికైంది. విద్యార్థినిలోని సృజనాత్మకతను వెలికితీసి, రచనా నైపుణ్యాలను ప్రోత్సహించే దిశగా తెలుగు ఉపాధ్యాయుడు బొడ్డు భరద్వాజ అందించిన మార్గదర్శకత్వం ప్రశంసనీయమని పలువురు అభిప్రాయపడ్డారు.
జాతీయస్థాయి పోటీలో కథ ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని మెరుగు సుచిప్రియను ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ రావు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది అభినందించారు. భవిష్యత్తులోనూ సాహిత్య రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.










