మండలంలోని యూ టర్న్ ప్లే అండ్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు కైండ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తమ ఉదారతను చాటుకున్నారు. పేద పిల్లలకు, నిరుపేద కుటుంబాలకు అవసరమైన నిత్యావసర వస్తువులను, ఆర్థిక సహాయాన్ని సేకరించి పంపిణీ చేశారు.
పాఠశాల యాజమాన్యం చేపడుతున్న యూ టర్న్ స్మార్ట్ లీడర్ ప్రోగ్రాంలో భాగంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు తమ కుటుంబాల నుండి నిత్యావసర వస్తువులను సేకరించడంతో పాటు, ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు.
సేకరించిన వస్తువులు, ఆర్థిక సహాయంతో మరికొన్ని నిత్యావసర సరుకులను కొనుగోలు చేశారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని శిశు గృహలో ఉన్న చిన్నారులకు అవసరమైన వస్తువులను అందజేశారు. అనంతరం బంగారు గూడలోని పలువురు పేద కుటుంబాలకు కూడా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో యూ టర్న్ విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో సామాజిక సృహ, నాయకత్వ లక్షణాలు పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.












