ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన సమీక్షలో ఆయన ఈ సూచనలు చేశారు.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవసరమైన పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు, మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు. పాఠశాలల్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టి, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యను అభ్యసించేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, ఈడబ్ల్యుఐడిసి డిప్యూటీ ఈఈ గంగాధర్ గౌడ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












