స్వయం సహాయక సంఘాల సభ్యులకు వ్యక్తిగత ఎంటర్ప్రైజ్ రుణాల లభ్యతను పెంచేందుకు, లోకాస్ యాప్ ద్వారా రుణ దరఖాస్తుల ప్రక్రియపై ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏపీఎంలు, సీసీలకు గురువారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. సెర్ప్ అధికారులు ఈ శిక్షణను అందించారు.
డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఎంటర్ప్రైజ్ క్రెడిట్ లభ్యతను బలోపేతం చేసేందుకు, వ్యక్తిగత ఎంటర్ప్రైజ్ లోన్ అప్లికేషన్‌ను అమలు చేసి, నూతనంగా ప్రారంభించే విధానంపై సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి మార్గనిర్దేశం చేశారు. లోకాస్ యాప్ ద్వారా స్వయం సహాయక సంఘాలకు వ్యక్తిగత ఎంటర్ప్రైజ్ రుణ దరఖాస్తులను ఎలా చేయించాలనే దానిపై గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీ కార్యాలయంలో జిల్లాలోని 20 మండలాల ఏపీఎంలు, సీసీలకు శిక్షణ ఇచ్చారు. సెర్ప్ ఏపీడీ గోవిందరావు, బీఎల్డీపీఎం ఖాస్బె జ్ఞాను వ్యక్తిగత ఎంటర్ప్రైజ్ రుణాల దరఖాస్తు ప్రక్రియపై శిక్షణనిచ్చారు. ఏపీఎంలు, సీసీలకు ఎదురైన సందేహాలను నివృత్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని 20 మండలాలలో 4610 వ్యక్తిగత ఎంటర్ప్రైజ్ రుణాలకు దరఖాస్తు చేయించాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. ప్రతి సీసీ వ్యక్తిగత ఎంటర్ప్రైజ్ రుణ దరఖాస్తు అప్లికేషన్‌పై అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే సీసీలు క్లస్టర్ లక్ష్యాలను సులభంగా సాధించగలరని అన్నారు. ఈ శిక్షణపై ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా, మండలాల వారీగా, క్లస్టర్ వారీగా రుణ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కోరారు. డీపీఎం హేమలత , తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో దరఖాస్తు చేయడానికి ఈనెల 12వ తేదీ వరకు గడువు ఉందని, ఇచ్చిన గడువులోగా మండలాలకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కోరారు. ఫామ్ డీపీఎం శోభారాణి , ఆజీవికా రిజిస్ట్రేషన్ 2025-26కు సంబంధించి, మండలాల వారీగా జీరో ఉన్న మండలాల లక్ష్యాలను ఈ వారంలో పూర్తి చేయాలని అన్నారు. నాన్ ఫామ్ డీపీఎం వెంకట సాయి ప్రసాద్ , మండలంలోని ప్రతి సీసీకి రెండు ఇంక్యుబేటర్ ఎంటర్ప్రైజ్ లక్ష్యం ఇవ్వగా, ఇంకా చాలామంది సీసీలు వారి లక్ష్యాన్ని పూర్తి చేయలేదని, రెండు రోజులలో ప్రతి సీసీ రెండు చొప్పున ఇంక్యుబేటర్ ఎంటర్ప్రైజ్లను పూర్తి చేయాలని కోరారు.
ఐబీ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ డీపీఎం రమాకాంత్ , ఈ నెల 3వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని టీటీడీసీ కార్యాలయంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం జరుపుకుంటున్నామని, కాబట్టి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మండలాలు, గ్రామాల నుంచి రెండు వయోవృద్ధుల సంఘాల సభ్యులను ఆదిలాబాద్ టీటీడీసీ కార్యాలయానికి తీసుకురావాలని ఏపీఎంలు, సీసీలను కోరారు. ఎస్‌వీఈపీ నాన్ ఫామ్ డీపీఎం వక్కులా , బీఆర్సీ ఉట్నూర్ క్లస్టర్ పరిధిలోని ఇంద్రవెల్లి, షాంపూర్, ఉట్నూర్, నార్నూర్, గాంధీగూడ మండలాలలో ఇచ్చిన ఎస్‌వీఈపీ రుణాలపై దృష్టి సారించాలని, సెర్ప్ నుంచి ఫామ్ డైరెక్టర్ గూగుల్ మీట్లో రివ్యూ తీసుకుంటున్నారని, మండలాల వారీగా ఏపీఎంలు అకౌంటెంట్లు డీసీబీ తయారుచేసి ప్రతి నెలా బీఆర్సీ అకౌంట్‌కు సీఐఎఫ్ పంపాలని కోరారు. స్త్రీనిధి ఆర్ఎం పూర్ణచందర్ , మండలాల వారీగా స్త్రీనిధిలో మొండి బకాయిలు ఉన్న సీసీలు రుణాలను వసూలు చేయాలని, త్వరలోనే జిల్లా కలెక్టర్‌తో కలిసి బకాయిల వసూళ్లపై సమావేశం ఉంటుందని కోరారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో 20 మండలాల ఏపీఎంలు, సీసీలు, డీఆర్డీఏ డీఈఓలు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












