బైంసా పట్టణంలోని కిసాన్ గల్లీకి చెందిన, అవార్డు గ్రహీత, సామాజిక సేవకుడైన తాడేవార్ ఉత్తమ కుమార్తె తాడేవార్ నిఖిల ఎంబీబీఎస్ సీటు సాధించారు. ఈ సందర్భంగా నిఖిలను పలువురు ఘనంగా సన్మానించారు. నిఖిల వైద్య విద్యలో సీటు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో వైద్య రంగంలో ఉన్నతంగా రాణించి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దత్తత్రి, కౌన్సిలర్ ప్రవీణ్, న్యాయవాది సనత్, మాజీ కౌన్సిలర్ ఆలకొండ సాయినాథ్, బండి రవి, కాసుల ప్రవీణ్, బండి సంజయ్, అజీజ్, కురిసి భజనలు భూమయ్య, కీని రాజు, బాలల వైద్యుడు విజ్ఞానందు, వైద్యులు రజనీకాంత్, దామోదర్, కేరళ ఆయుర్వేద నిపుణుడు తాడివారి సాయినాథ్, న్యాయవాది ఐకెపీ దత్తాత్రేయ, నిర్మల్ మున్సిపాలిటీకి చెందిన నితిన్, నవీన్ కుమార్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు సంతోష్, తానూర్ విలేకరి సంతోష్, మాజీ సైనికుడు, వ్యాపారవేత్త బర్ల సాయినాథ్ తదితరులు పాల్గొని నిఖిలను అభినందించారు.
ఎంబీబీఎస్ సీటు సాధించిన నిఖిలకు ఘన సన్మానం
Share:

సారాంశం
బైంసా పట్టణంలోని కిసాన్ గల్లీకి చెందిన, అవార్డు గ్రహీత, సామాజిక సేవకుడైన తాడేవార్ ఉత్తమ కుమార్తె తాడేవార్ నిఖిల ఎంబీబీఎస్ సీటు సాధించారు. ఈ సందర్భంగా నిఖిలను పలువురు ఘనంగా సన్మానించారు.
ముఖ్య విషయాలు
- బైంసా పట్టణంలోని కిసాన్ గల్లీకి చెందిన, అవార్డు గ్రహీత, సామాజిక సేవకుడైన తాడేవార్ ఉత్తమ కుమార్తె తాడేవార్ నిఖిల ఎంబీబీఎస్ సీటు సాధించారు.
- నిఖిల వైద్య విద్యలో సీటు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
- ఈ సందర్భంగా నిఖిలను పలువురు ఘనంగా సన్మానించారు.
- శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3984ఆర్టికల్స్
4,81,833వ్యూస్










