నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని విద్యా భారతి పాఠశాలలో నూతన తాగునీటి శుద్ధి పరికరాన్ని బుధవారం ప్రారంభించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రిబ్బన్ కత్తిరించి, పరికరాన్ని ప్రారంభించారు. విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని విద్యా భారతి పాఠశాలలో నూతన తాగునీటి శుద్ధి పరికరాన్ని బుధవారం ప్రారంభించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రిబ్బన్ కత్తిరించి, పరికరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ తాగునీటి శుద్ధి పరికరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీటిని అందించడం ద్వారా వారి ఆరోగ్య పరిరక్షణకు పాఠశాల యాజమాన్యం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యమే తమ ప్రథమ బాధ్యత అని పేర్కొన్నారు.
పరిశుభ్రమైన తాగునీరు విద్యార్థుల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పోతన్న, లక్ష్మ, మధుసూదన్, కొట్టే ప్రవీణ్, రాజు, సాయినాథ్, దేవేందర్, దేవకి, సరస్వతి, రాణి, శృతిక, పద్మ, నేహ, గంగావేణి, లక్ష్మి, కవిత, గంగామణి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.











