జాతీయ స్థాయిలో జరిగిన నీట్ పీజీ ఎంట్రన్స్ పరీక్షలో మిర్యాలగూడకు చెందిన మైనం కృష్ణయ్య, ఉమా దంపతుల కుమార్తె డాక్టర్ మైనం భవ్య 698 ర్యాంక్ సాధించింది. ఆమె ఎంబిబిఎస్ ను పాండిచ్చేరిలో జూలై నెలలో పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పీజీ ఎంట్రన్స్ పరీక్షకు 2,66,000 మంది హాజరు కాగా, మైనం భవ్య 698 ర్యాంకు సాధించి జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచింది. పీజీలో రేడియాలజీ కోర్సు చేయనున్నట్లు డాక్టర్ భవ్య తెలిపారు.
డాక్టర్ భవ్య తండ్రి మైనం కృష్ణయ్య మండలంలో సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించిన సందర్భంగా, పిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి జానారెడ్డి, మండల విద్యాధికారి లక్ష్మణ్ నాయక్, నాయకులు సుదర్శన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నాతాల శ్రీనివాస్ రెడ్డి, జనార్ధన్ శ్రీనివాస రావు, బ్రహ్మం, ఉపేందర్, ఉపాధ్యాయులు అనుముల శ్రీనివాస్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, శ్రీధర్, చైతన్య లత, విజయ నిర్మల, దేవేందర్ రెడ్డి, జయ, నాగమణి, కమరున్నిసా బేగం తదితరులు అభినందించారు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.












