తానూరు (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 14
నిర్మల్ జిల్లా మండలం తొండాల గ్రామంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వినాయక విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గణనాథుడిని ప్రతిష్ఠించి, గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తొండాలలో ఘనంగా వినాయక ప్రతిష్ఠాపన ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామస్తులు , సెప్టెంబరు 14: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా మండలం తొండాల గ్రామంలో వినాయక విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గణనాథుడిని ప్రతిష్ఠించి గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో సుఖశాంతులు, సౌభాగ్యం వెల్లివిరియాలని గణనాథుడిని ప్రార్థించారు. కార్యక్రమంలో సర్పంచ్ మెరేకర్ మాధవ్, హోరే శివరామ్, హోరే కిషన్, బేల్దారే గంగాధర్, హోరే సాహెబారావు, హోరే శివరామ్‌తో పాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.











