నిర్వహించిన (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 14
నిర్మల్ జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసి, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఉత్సవాల సందర్భంగా పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.
*నిర్మల్ పోలీస్… మీ పోలీస్…* *వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీస్* నిర్మల్ (మనోరంజని తెలుగు టైమ్స్ నిర్మల్ జిల్లా ప్రతినిధి) నిర్మల్ జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీస్ స్వయంగా పాల్గొని వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. *మట్టి వినాయక విగ్రహాల పంపిణీ* గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా డా. జి. జానకి షర్మిల, ఐపీస్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు “మట్టి గణపతిని పూజిద్దాం – పర్యావరణాన్ని రక్షించుకుందాం” అనే సందేశంతో ప్రజలు మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని పోలీస్ శాఖ సూచించింది. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్పీ కోరారు. *గణేష్ నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు* గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అధికారులు, సిబ్బందిఅప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీసూచించారు. గణేష్ మండపాలు, ఊరేగింపు మార్గాలు, ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని బందోబస్తు విధుల్లో ఉన్న పోలీస్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీస్ తో పాటు భైంసా ఎ యస్ పి సాయి కిరణ్, ఐపీస్ , నిర్మల్ డి స్ పి శ్రీనివాస్, సి ఐ లు కృష్ణ గోవర్ధన్ రెడ్డి సమ్మయ్య సత్యనారాయణ, ఆర్ ఐ లు రాంనిరంజన్, శేఖర్, ఎస్ ఐ లు, ఆర్ఎస్ఐ లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మట్టి గణపతిని పూజిద్దాం… పర్యావరణాన్ని రక్షిద్దాం… భక్తిశ్రద్ధలతో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకుందాం.











