ఒబులవారిపల్లె, 15 September
మండలం ముక్కావారిపల్లి అరుంధతివాడలో ఏర్పాటు చేసిన శ్రీ వినాయకస్వామి ప్రతిమను రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో యువనేత ముక్కా సాయి వికాస్రెడ్డి కూడా పాల్గొన్నారు.
ముక్కావారిపల్లిలో వినాయకుడికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పూజలు వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న యువనేత ముక్కా సాయి వికాస్రెడ్డి రైల్వేకోడూరు: మండలం ముక్కావారిపల్లి అరుంధతివాడలో ఏర్పాటు చేసిన శ్రీ వినాయకస్వామి ప్రతిమను రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి కుమారుడు, యువనేత ముక్కా సాయి వికాస్రెడ్డి కూడా స్వామివారిని దర్శించుకున్నారు. వినాయక చవితి సందర్భంగా స్థానికుల ఆహ్వానం మేరకు ముక్కావారిపల్లి అరుంధతివాడకు చేరుకున్న నాయకులకు ఉత్సవ నిర్వాహకులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రైల్వేకోడూరు నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని నాయకులు ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకలు ప్రజల్లో ఆధ్యాత్మికతతో పాటు ఐక్యతా భావాన్ని మరింత పెంపొందించాలని ప్రార్థించారు. కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు, స్థానికులు, భక్తులు, యువత, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












