కొత్తగూడెం, 15 September
భద్రాచలం పట్టణంలోని నగర్లో వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు జిల్లా స్థాయి అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
YSR నగర్లో ఘనంగా వినాయక పూజా కార్యక్రమం భద్రాచలం: భద్రాచలం పట్టణంలోని YSR నగర్లో వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భద్రాద్రి జిల్లా పంచాయతీ అధికారి శ్రీమతి బొప్పన అనూష గారు దంపతులు , మహబూబాబాద్ జిల్లా DPO శ్రీ యాడారి రేవంత్ గారు, ఖమ్మం జిల్లా DPO శ్రీ G. వినోద్ కుమార్ గారు దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా YSR నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు శ్రీ దల్లి చంద్రశేఖర్ రెడ్డి గారు వారికీ శాలువాతో సత్కారం చేసారు మరియు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు అతిథులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు పాపయ్య,బాలయోగి,G. రవి, అప్పారావు, చందు, బాబురావు, సత్యనారాయణ, రాము,కృష్ణ తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమం భక్తి శ్రద్ధలతో, స్నేహపూర్వక వాతావరణంలో విజయవంతంగా జరిగింది.












