మెండోరా (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 15
మండలం చాకిరియాల గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణేశ్ విగ్రహాన్ని ఘనంగా ప్రతిష్ఠించారు. ఉపాధ్యాయుడు ఆరేపల్లి దేవన్న సుమారు రూ.10 వేల వ్యయంతో విగ్రహాన్ని సమకూర్చి గ్రామ అభివృద్ధి కమిటీకి అందజేశారు.
చాకిరియాలలో కొలువుదీరిన గణనాథుడు ప్రతినిధి, సెప్టెంబరు 15 మండలం చాకిరియాల గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద ప్రతి సంవత్సరం నిర్వహించే వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణేశ్ విగ్రహాన్ని ఘనంగా ప్రతిష్ఠించారు. గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు ఆరేపల్లి దేవన్న సుమారు రూ.10 వేల వ్యయంతో విగ్రహాన్ని సమకూర్చి గ్రామ అభివృద్ధి కమిటీకి అందజేశారు.గణేశ్ విగ్రహాన్ని గ్రామంలో భారీ ఊరేగింపు, ర్యాలీగా తీసుకెళ్లి హనుమాన్ దేవాలయం వద్ద ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా విగ్రహ దాత ఆరేపల్లి దేవన్నను గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ మధు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, యువత, మహిళలు పాల్గొన్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.












