బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 15
రంగస్థల నటుడిగా విశిష్ట గుర్తింపు పొందిన బాపనపల్లి వెంకటస్వామి మంగళవారం మండలం మాటేగాం గ్రామంలోని కొరడి గణపతిని దర్శించుకోనున్నారు. ఆయన రాకతో స్థానికులు, భక్తుల్లో ఆసక్తి నెలకొంది.
కొరడి గణపతిని దర్శించుకోనున్న రంగస్థల నటుడు రంగస్థల నటుడిగా విశిష్ట గుర్తింపు పొందిన బాపనపల్లి వెంకటస్వామి మంగళవారం మండలం మాటేగాం గ్రామంలోని కొరడి గణపతిని దర్శించుకోనున్నారు. రంగస్థల కళారంగంలో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు కేంద్ర మంత్రుల చేతుల మీదుగా అవార్డులు అందుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా ఆరు దేశాల అధ్యక్షుల చేతుల మీదుగా కూడా పురస్కారాలు అందుకున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాపనపల్లి వెంకటస్వామి కొరడి గణపతిని దర్శించుకోనుండటంతో స్థానికులు, భక్తుల్లో ఆసక్తి నెలకొంది. ఆయనకు ఆలయ నిర్వాహకులు, స్థానికులు స్వాగతం పలకనున్నట్లు తెలిపారు.


