తానూర్, 14 September
నిర్మల్ జిల్లా మండలం భోసి గ్రామంలో కొలువుదీరిన శ్రీ వరసిద్ధి కర్ర వినాయక స్వామి దేవాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకోవాలని నిర్వాహకులు కోరారు.
భోసిలో నేడు వరసిద్ధి కర్ర వినాయకుడికి ప్రత్యేక పూజలు రెండో రోజు నిత్య పూజలు.. యజ్ఞం, అన్నదానం, సంగీత విభావరి నిర్మల్ జిల్లా మండలం భోసి గ్రామంలో కొలువుదీరిన శ్రీ వరసిద్ధి కర్ర వినాయక స్వామి దేవాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకోవాలని నిర్వాహకులు కోరారు. ఉదయం 5 గంటలకు కాభడా హారతి, 6 నుంచి 7 గంటల వరకు స్వామివారికి అభిషేకం, 7 నుంచి 8 గంటల వరకు హారతి, ప్రసాద వితరణ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి అన్నదానం, 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యజ్ఞం, ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పురస్తు గోపాల్ కిషన్, పురస్తు రాహుల్ ఆధ్వర్యంలో భైంసాకు చెందిన రస రంజని సంగీత విద్యాలయం వారిచే సంగీత విభావరి నిర్వహించనున్నారు. సాయంత్రం 7 నుంచి రాత్రి 8 గంటల వరకు మహాహారతి, ప్రసాద వితరణ, రాత్రి 9 గంటల అనంతరం భజన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.












