భైంసా, 14 September
భైంసాలోని ఎస్ఎస్ ఫ్యాక్టరీలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం విఘ్నేశ్వరుడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఈ కార్యక్రమంలో పాల్గొని, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గణనాథునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.
భైంసాలో ఎస్ఎస్ ఫ్యాక్టరీలో ఘనంగా వినాయక ప్రతిష్ఠాపన ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భైంసా, సెప్టెంబరు 14: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భైంసాలోని ఎస్ఎస్ ఫ్యాక్టరీలో విఘ్నేశ్వరుడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గణనాథునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. వినాయక చవితి పర్వదినం ప్రజల జీవితాల్లో శాంతి, సౌభ్రాతృత్వం, అభివృద్ధిని తీసుకురావాలని కోరుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, ఫ్యాక్టరీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.











