బాసర, 10 September
బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు ఆలయాన్ని సందర్శించి, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.
జోరుగా సాగుతున్న బాసర ఆలయ అభివృద్ధి పనులు బాసర, , సెప్టెంబరు 10 బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు ఆలయంలోని బాలాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ గర్భగుడి నిర్మాణ దాత సూరపనేని సునంద్ దంపతులతో కలిసి ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు.శ్రీనివాసరాజుకు ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనిదేవి, సర్పంచ్ వెంకటేష్‌గౌడ్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన అధికారులతో మాట్లాడారు. పుష్కరాల లోపు ఆలయ అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులను అధికారులు దగ్గరుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్మాణంలో ఎలాంటి లోపాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని శ్రీనివాసరాజు సూచించారు.












