బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 14
మండలంలోని మాటేగాం గ్రామంలో కొరడి గణనాథుని సన్నిధిలో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో జరిగిన గణనాథుని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
*కొరడి గణనాథుని సన్నిధిలో ఎమ్మెల్యే పూజలు* మండలంలోని మాటేగాం గ్రామంలో కోరడి గణనాథుని సన్నిధిలో *ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్**ప్రత్యేక పూజలు చేశారు.. వేద పండితుల ఆధ్వర్యంలో గణనాథుని ప్రాణ ప్రతిష్ట నిర్వహించిన ఈ కార్యక్రమంలో అశేష సంఖ్యలో భక్తజనం పాల్గొన్నారు. గంటకు పైగా అక్కడే ఉండి వేద మంత్రోచ్చరణ ల మధ్య ఎమ్మెల్యే పూజలు చేశారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విగ్నేశ్వరుడు అందరి విజ్ఞలు తొలగించి, ప్రతి ఇంట సుఖశాంతులు నెల కొనాలని కొరడి గణనాథున్ని మొక్కు కున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ తుమొల్ల దత్తాత్రి, మాజీ మున్సిపల్ చైర్మన్ బి. గంగాధర్, బైసా మండల బిజెపి అధ్యక్షురాలు దేగాం సర్పంచ్ సిరం సుష్మరెడ్డి, నాయకులు వెంగల్ రావ్, రమణ రావ్, గంగాధర్ గౌడ్, డాక్టర్ ముత్యం రెడ్డి,సర్పంచ్ లు శ్రీనివాస్, శ్యామ్ రావ్, అశోక్, వినోద్, సాయినాథ్, నాయకులు మాజీ ఎంపిటిసి అశోక్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి సాయినాథ్ తదితరులు ఉన్నారు.











