భైంసా, 15 September
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బైంసా పట్టణంలో గణేష్ మండపాల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ముధోల్ నియోజకవర్గ ఇంచార్జి విలాస్ గాదెవార్ బైంసాలోని గణేష్ మండపాన్ని సందర్శించి గణనాథుడిని దర్శించుకున్నారు.
బైంసాలో గణనాథుడిని దర్శించుకున్న బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి విలాస్ గాదెవార్ బైంసా: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బైంసా పట్టణంలోని వివిధ గణేష్ మండపాల్లో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ముధోల్ నియోజకవర్గ ఇంచార్జి విలాస్ గాదెవార్ బైంసా పట్టణంలోని గణేష్ మండపాన్ని సందర్శించి గణనాథుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వినాయకుడి ఆశీస్సులు పొందారు. అనంతరం నిర్వాహకులతో మాట్లాడి ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.











