తానూర్, 15 September
మండలంలోని బోసి గ్రామంలోని వరసిద్ధి విఘ్నేశ్వరుడిని మంగళవారం ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికి, జ్ఞాపికను అందజేశారు. ప్రజల సుఖ సంతోషాల కోసం ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు.
*బోసి గ్రామంలో వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే* మండలంలోని బోసి గ్రామంలో వరసిద్ధి కర్ర విగ్నేశ్వరున్ని మంగళవారం *ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్* దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా స్వాగతించి శాలువాతో సత్కరించి, వరసిద్ధి వినాయకుని జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పటేల్ మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే వరసిద్ధి వినాయకుడు ప్రజలను సుఖ సంతోషాలతో, ఉంచాలని ఆకాంక్షించారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలని, వర్షాలు పుష్కలంగా కురిసి రైతు మొహంలో ఆనందం వెల్లి విరియాలని మొక్కు కు న్నట్లు చెప్పారు. ఆయన వెంట భైంసా మున్సిపల్ చైర్మన్ తుమొల్ల దత్తాత్రి తో , ముధోల్ మండలాల బిజెపి నాయకులు, సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు











